సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెను విజయవంతం చేయాలి : టియుసిఐ రాష్ట్ర నాయకులు జాడి ద

Published: Monday December 06, 2021
మంచిర్యాల బ్యూరో, డిసెంబర్ 05, ప్రజాపాలన : సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 9, 10, 11 తేదీలలో కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విదానాలను నిరసిస్తూ సింగరేణి ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా చెపట్టనున్న సమ్మెను విజయవంతం చేయాలని టియుసిఐ రాష్ట్ర నాయకులు జాడి దేవరాజ్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని, ప్రభుత్వం విదానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈనెల 13వ తేదీన సింగరేణి నాలుగు బ్లాకులను ప్రైవేటు పరం చేయడానికి సిద్ధపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు అమలు చేయాలని, గని ప్రమాదంలో చనిపోయిన కాంట్రాక్ట్ కార్మికులకు 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, సింగరేణిలో ప్రమాదంతో చనిపోయిన కార్మికులకు కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఓపెన్ కాస్ట్ లను రద్దు చేసి అండర్ గ్రౌండ్ మైనింగ్ లు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ప్రదాన డిమాండ్ లతో కార్మికులు సమ్మె బాట పట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ డిమాండ్లను జాతీయ సంఘాలతో చర్చించి పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.