ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Published: Monday August 09, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 08, ప్రజాపాలన ప్రతినిధి : గ్రామంలోని ప్రజలు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ చెరుకూరి అండాలుగిరి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో వనస్థలిపురం ప్రగ్మా ఆస్పత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలనునిర్వహించారు. ఇందులో సుమారు 152 మంది రోగులకు వివిధ రకాల  చికిత్సలు అందించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ చెరుకూరి అండాలుగిరి మాట్లాడుతూ.. ప్రజలు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చుట్టూరా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కొన్ని ఆస్పత్రులు వైద్యాన్ని వ్యాపారంగా మల్చుకొని పనిచేస్తున్నాయని సమాజ సేవలో ముందుండలని కోరారు. తమ గ్రామాన్ని దత్తత తీసుకొని ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన ప్రగ్మా ఆస్పత్రి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి నెల నిర్వహించే ఈ ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చెస్క్ 9 వాళ్ళున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి చెరుకూరి మంగరవీందర్, ఉపసర్పంచ్ జంగారెడ్డి, వార్డు సభ్యులు, ప్రగ్మా ఆస్పత్రి జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ ఆర్దో పెడిక్ వైద్యులు కార్తీక్ రెడ్డి, గైనకాలజిస్ట్ చందన, ఆస్పత్రి ఇంచార్జి మహేష్, చంద్రమౌళి, నార్సింగ్ స్టాఫ్ అరుణ, పార్మాసి శరణప్ప తదితరులు పాల్గొన్నారు.