ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి

Published: Monday September 27, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూడిద నరసింహారెడ్డి మాట్లడుతూ చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం పోరాడి ఎంతో మందికి భూమి పంచి అగ్రస్థానంలో నిలిచిన వీరనారికి విరోచిత పోరాటం చేసి దున్నేవాడిదే భూమి కావాలంటు పోరాటం చేసిన ఐలమ్మ జయంతి జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మార ముని శ్రీనివాస్ బూడిద పద్మమ్మ నరుడు మహేందర్ కో ఆప్షన్ సభ్యులు మడుపు గోపాల్ మరియు తెరాస నాయకులు  బోసు పల్లి నందకుమార్, ఓరుగంటి నరసింహ గౌడ్, బత్తుల వెంకటేష్, బొడుసు వెంకటేష్ యాదవ్, మడుపు వెంకటేష్, బోసు పల్లి కర్ణాకర్, నడికుడి నరసింహ, నరకుడి ఆనంద్, బుట్టి మహేందర్, పో రెడ్డి రంగారెడ్డి, బోస్ పెళ్లి సురేందర్, మడుపు శ్రీరాములు, మరియు కారోబార్ నరసింహ, గ్రామ ప్రజలు యువజన సంఘాలు పాల్గొన్నారు.