కేసీఆర్ నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలి : కాంగ్రెస్ డిమాండ్

Published: Thursday November 11, 2021
జగిత్యాల, నవంబర్ 09 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిరుద్యోగ చైతన్య నిరాహార దీక్షను చేపట్టారు. తెరాస ప్రభుత్వం 2018 నుండి ఇప్పటి వరకు నూతన ఉద్యోగ నోటిఫికేషన్స్ కానీ నిరుద్యోగ భృతిని కానీ ఇంతవరకు అమలు చేయకపోవడం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్నారని ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న కేసీఆర్ కనీసం మ్యానిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతిని కూడ అమలు చేయకపోవడం నిరుద్యోగుల దురదృష్టకరం అని నోటిఫికేషన్స్ ఇయ్యకపోతే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపాడుతమని ప్రభుత్వన్నీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బండ శంకర్ గిరి నాగభూషణం గాజుల రాజేందర్ నక్క జీవన్ కల్లేపల్లి దుర్గయ్య కొత్త మోహన్ కట్ట శివ ఏలగందుల కిరణ్ కుమార్ గుండ మధు రఘువీర్ గౌడ్ నరేష్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.