విద్యార్థులు పాఠ్యపుస్తకాలను ప్రేమిస్తూ మార్గదర్శకులుగా ఎదగాలి హుజూరాబాద్ నవంబర

Published: Tuesday November 29, 2022

విద్యార్థులు పాఠ్యపుస్తకాలను ప్రేమిస్తూ మార్గదర్శకులుగా ఎదగాలని మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షుడు ప్రముఖ కవి రచయిత వ్యక్తిత్వ వికాసం నిపుణులు ఆధ్యాత్మిక గురువు డాక్టర్ నాగుల సత్యం పేర్కొన్నారు. ఆయన సోమవారం హుజూరాబాద్ పట్టణంలోనీ వాగ్దేవి డిగ్రీ కళాశాల ఫైనల్ విద్యార్థులకు వారి భవిష్యత్తుకు ఉపయోగపడే  పలు ప్రధాన అంశాల మీద ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఏనుగు మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు సెమినార్  ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యం మాట్లాడుతూ....  విద్యార్థులు, యువత ప్రేమ వ్యవహారాలకు, చెడు వ్యసనాలకు, దూరంగా ఉండి పాఠ్యపుస్తకాలనే ప్రేమిస్తూ , అత్యధిక మార్కులు సంపాదించుకోవాలన్నారు . యువత విద్యార్థులు ప్రేమకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోకూడదని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు పొద్దస్తమానం సెల్ ఫోన్లకు అలవాటుపడి, తమ ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకోకూడదని డాక్టర్ సత్యం గౌడ్ పిలుపునిచ్చారు. ఇష్టపడడం కూడా బలహీనతలో భాగమేనని  సూచిస్తూ, బలహీనతలో ఎవరు సమర్ధులు, బుద్ధిమంతులు కారని, ఎంతో ఉజ్జల భవిష్యత్తును ఇచ్చే పాఠ్యపుస్తకాలను ఇష్టపడి చదువుతు ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు, ప్రతి విద్యార్థి సేవాభావాన్ని అలవర్చుకొని సమాజసేవలో భాగస్వాములు కావాలన్నారు. తల్లిదండ్రుల గురువుల కన్న కలలు నెరవేస్తూ, సమాజానికి మూల స్తంభముల విద్యార్థి పాత్రను పోషించి, దేశ భవిష్యత్తుకు, కుటుంబ భవిష్యత్తుకు వెలుగునిచ్చే సూర్య కిరణంలా విద్యార్థి పాత్రను అంతటి స్థాయిలో పోషించాలన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కే రమేష్ డి శ్రీనివాస్ తిరుపతి నవీన్ సతీష్ స్వామి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.