అధ్వానంగా మారిన బోనకల్ ఫ్లై ఓవర్ ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు

Published: Monday February 13, 2023

బోనకల్, ఫిబ్రవరి 12 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని ఫ్లైఓవర్‌ బ్రిడ్జి గుంతల మయమై అధ్వానంగా మారి ఇనుప చువ్వలు పైకి తేలి ప్రమాదాలకు నిలయంగా మారింది. గుంతల్లో నీరు చేరడంతో వాహన దారులకు కనపడక కింద పడి ప్రమాదాలకు గురవుతు న్నారు. రాత్రి వేళల్లో ఈ ఫ్లై ఓవర్ మీదుగా ప్రయాణిం చాలంటే ఫ్లై ఓవర్ పై వీధిలైట్లు లేక ప్రజలకు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గుంతలు కనబడగానే వాహనదారులు గుంతలను తప్పించబోయి వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై కాంక్రిట్‌ చెదిరి పోయి ఇనుప రాడ్లు పైకి తేలినా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యం వందలాది భారీ వాహనాలు, ట్రక్కులు, లారీలు బోనకల్ మీదుగా తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. వాటితో పాటు నిత్యం కార్లు, ఆటో లు, ద్విచక్ర వాహనాలతో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం పెరిగిన రద్దీకి గుంతల మయమై ప్రమాదాలు చోటు చేసు కుంటున్నాయి. ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలకు శాశ్వత మరమ్మతు చేయాలని పలువురు వేడుకుంటున్నారు. ప్రమాదాలతోపాటు వాహనాలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై ఉన్న గుంతల సమస్యను ఆర్‌అండ్‌బీ శాఖ దృష్టికి మండల పరిషత్ సమావేశంలో ఆర్ అండ్ బి అధికారులకు ప్రజా ప్రతినిధులు ఎన్నోసార్లు తెలియజేసిన ఆర్ అండ్ బి అధికారులు మాకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మట్టితో గుంతలు పూడ్చారు తప్ప శాశ్వతంగా మరమ్మత్తులు చేయడం లేదు. పెరిగిన భారీ వాహనాల వల్ల అధికంగా గుంతలు ఏర్పడి ఫ్లై ఓవర్ పై విద్యుత్ లైట్లు లేకపోవడం వలన తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతినిత్యం ఆర్ అండ్ బి అధికారులు ఏర్పడిన గుంతలను చూస్తున్నారు తప్ప మరమ్మత్తులు చేపట్టడం లేదు. ఎదు రెదురుగా వచ్చే వాహనాలు గుంతలను తప్పించబోయి ఢీకొని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను వెంటనే మరమ్మతు చేపట్టాలని ఆర్‌ ఆండ్‌ బీ శాఖ అధికారులను వాహనదారులు, మండల ప్రజలు వేడుకుంటున్నారు.