ఖానాపూర్ గ్రామ దళితుల బడుగు బలహీన వర్గాల భూముల జోలికొస్తే సహించేది లేదు ప్రభుత్వానికి మల్ ర

Published: Wednesday September 28, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 27 ప్రజాపాలన ప్రతినిధి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలోని ఎన్నో ఏళ్లుగా పట్టాలు పొంది పాస్ బుక్ లు పొంది వారి అకౌంట్లో రైతుబంధు జమవుతున్న వారి భూములను ఇప్పుడు లాక్కోవడం అన్యాయమని *ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ముద్దుబిడ్డ మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు..మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దీక్ష చేస్తున్న పేద బడుగు బలహీన వర్గాలు దళిత బిడ్డలకు సంఘీభావం తెలపడం జరిగింది... ఈ సందర్భంగా మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ దళితుల బలహీన వర్గాల భూములను స్థానిక ఎమ్మెల్యే అధికారులపై ఒత్తిడి చేయించి లాక్కోవాలని ప్రయత్నం చేస్తే సహించేది లేదని వారికోసం ఎంతకైనా పోరాడుతానని హెచ్చరించారు.. ఈ సందర్భంగా ఆయన అక్కడి నుంచే కలెక్టర్ ఆర్డిఓ స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది.. ఎన్నో ఏళ్లుగా వాళ్ళ ఆధీనంలో ఉన్న భూములను ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి గుంజుకోవడం తగదని... స్థానిక ఎమ్మెల్యే దళితులు బడుగు బలహీన వర్గాల పట్ల వివక్ష చూపుతున్నాడని త్వరలో అతనికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన భూములను లాక్కొని చివరికి ప్లాట్లు ఇస్తామని మభ్యపెడుతున్నారని అన్నారు.. ఖానాపూర్ ప్రజలకు అండగా ఉంటానని అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పడం జరిగింది..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి చిలుక మధుసూదన్ రెడ్డి... జిల్లా కాంగ్రెస్ పార్టీ  అధికార ప్రతినిధి కొండ్రు ప్రవీణ్..స్థానిక కౌన్సిలర్లు ఆకుల మమత ఆనంద్.. పంది శంకర్.. నరాల విశాల సాగర్.. సుల్తానా ఫిరోజ్ బేగం... మోహన్ నాయక్.. స్థానిక నాయకులు..సొప్పరి రవికుమార్.. పెద్దగారి శ్రీకాంత్.. గౌస్.. డొంకానీ  చంద్రయ్య.. పంది యాదగిరి.. బుగ్గ రాములు..నాగార్జున ముదిరాజ్... రాజు.. కిరణ్* తో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు....