50 నిరుపేద కుటుంబాలకు సహాయ సహకారాలు అందించిన రాఘవేందర్

Published: Monday May 17, 2021
బాలపూర్:(ప్రతినిధి) ప్రజాపాలన : కరోనా మహమ్మారి తీవ్రత వల్ల లాక్ డౌన్ ప్రభావం భాగంలో ఎవరు ఆకలితో అల్లాడవద్దని రాఘవేంద్రర్ నిరుపేదలకు చేసిన సహాయ సహకారాలు మీర్ పేట పోలీస్ స్టేషన్ సీఐ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్ కార్పొరేటర్ సమక్షంలో తిరుమల హిల్స్ కాలనీవాసులైన ఉప్పలూరి రాఘవేంద్రర్, కాలనీ అధ్యక్షులు రఘు ఆధ్వర్యంలో ఆ డివిజన్ లో ఉన్నటువంటి తిరుమల హిల్స్ కాలనీ లో ఉన్న 50 నిరుపేదల కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మీర్ పేట్ పోలీస్ స్టేషన్ సీఐ మహేందర్ రెడ్డి తోపాటు బిజెపి కార్పొరేషన్ అధ్యక్షులు పెండ్యాల నర్సింహ్మ హాజరై, అతిథుల చేతుల మీదగా 50 నిరుపేద కుటుంబాలకు బియ్యం, పప్పు, ఉప్పు, సబ్బులు కూరగాయలు నిత్యావసర వస్తువులను అందజేశారు. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.... రోజు కూలి పని చేసుకునే వాళ్ళు లాక్ డౌన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని గ్రహించి రాఘవేందర్, రఘు ముందుకొచ్చి వారికి నిత్యవసర వస్తువులు సహాయ సహకారాలు  అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మానవత్వం చాటారని పేర్కొన్నారు. స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ.... కరోనా వల్ల ఎవరు ఇబ్బందులు పడకూడదని, ఎవరికి ఇబ్బంది కలిగిన మాకు తెలియజేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో పసునూరి బిక్షపతి చారి, కాలని అధ్యక్షులు రఘు, కృష్ణ సతీష్, శ్రీనివాస్, శివ కుమార్ చారి, గోపాల్, సాయి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.