*బంగారు మైసమ్మ దేవాలయం విగ్రహ,యంత్ర ప్రతిష్ఠ మహాత్సవము* * శ్రీ సాయి వెంచర్ మేనేజింగ్ డైరెక్టర

Published: Monday August 08, 2022

ఇబ్రహీంపట్నం ఆగష్టు తేదీ 7 ప్రజాపాలన ప్రతినిధి.ఇబ్రహీంపట్నం సాయిరాం నగర్ కాలనీ , బస్ డిపో ప్రక్కన గల వెంచర్ లో నూతనంగా నిర్మించిన బంగారు మైసమ్మ దేవాలయం నందు యంత్ర ప్రతిష్ట మహోత్సవం తదితర కార్యక్రమాలు జరుగునని శ్రీ సాయి వెంచర్ మేనేజింగ్ డైరెక్టర్ జైన్ శ్రీరామ్ రెడ్డి తెలిపారు. శుభకృత్ నామ సంవత్సర దక్షిణాయణ వర్షఋతువు శ్రావణ శుద్ధ ఏకదశి సోమవారము మొదలు శ్రావణ శుద్ధ చతుర్ధశి గురువారము వరకు అనగా తేది . 08-08-2022 నుండి తేది . 11-08-2022 వరకు జరిగే కార్యక్రమ వివరములు. తేది. 08 తేదీ సోమవారము మొదటి రోజున గణపతి పూజతో ప్రారంభమై 9వతేదీ మంగళవారము గణపతి పూజ , పుణ్యాహవాచనం,రక్షాబంధనం, పంచగవ్యము, అంకురారోపణము, అఖండ దీపారాధన, యాగశాల ప్రవేశము, ధ్వజా రోహణము, యోగినీ, వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ, సర్వతోబద్రమండలము, ఆవాహిత దేవతా పూజలు సాయంత్రం గం || 6.00 లకు జలాధీవాసము , ప్రదోషపూజలు , నైవేద్యము , హారతి , మంత్రపుష్పము , తీర్థ ప్రసాద వితరణ.10వ తేదీ బుధవారము రోజున ఉద ఆవాహిత దేవతా పూజలు , యోగినీ, వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ, సర్వతోబద్రమండల దేవతా హోమములు, శ్రీసూక్త పురుష సూక్త, దుర్గాసూక్త, మన్యసూక్త, రుద్ర హోమము జరుగును సాయంత్రం 5.00 గం "లకు ప్రతిష్టాంగ హోమములు, అధివాస హోమములు 7.00గం" లకు ధాన్యాదివాసము, ఫలాధివాసము , పుష్పాదివాసము , శయ్యాధివాసము పూజలు , రాజోపచారములు , ప్రదోషపూజలు, నైవేద్యము, హారతి , మంత్రపుష్పము , తీర్థ ప్రసాద వితరణ. 11వ తేదీ గురువారము రోజున ఆవాహిత దేవతా పూజలు, ఘర్తన్యాసము, మూలమంత్ర హోమములు, సూక్త హోమములు ఉదయం గం" 10-15 ని॥లకు యంత్ర ప్రతిష్ఠ , విగ్రహ ప్రతిష్ఠ , సింహ ప్రతిష్ఠ , బలి ప్రదానము శిఖర కుంభాభిషేకము , ఆలయ ప్రోక్షణ, నైవేద్యము, హారతి, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వితరణ, మార్జనము , మహదాశీర్వచనము కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈకార్యక్రమములో పాల్గోని తీర్థ ప్రసాదములు , అన్నప్రసాదం స్వీకరించి శ్రీ బంగారు మైసమ్మ దీవెనలు పొందగలరని కళ్లెం జీవన్ రెడ్డి, జైన్ శ్రీరామ్ రెడ్డి నందికొండ రవీందర్ రెడ్డి కోరడం జరిగింది.