ఇబ్రహీంపట్నం జూన్ తేదీ 14 ప్రజా పాలన ప్రతినిధి. కన్నుల పండుగగా ముగిసిన శ్రీశ్రీ శ్రీ మల్లికార

Published: Wednesday June 15, 2022
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పోల్కంపల్లి అనుబంధ గ్రామమైన మాన్యగూడ లో శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం  వేడుకలు  ఘనంగా ముగిషాయి. చుట్టుపక్కల గ్రామాల నుండే కాక వివిధ  మండలాల నుంచి కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి అశేష జనం రావడం జరిగింది. అందరి సమక్షంలో కల్యాణ మహోత్సవం మల్లికార్జునుడు సంతోష పడేలా గత 16 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న కళ్యాణ మహోత్సవానికి భక్తి శ్రద్ధలతో టి మల్లికార్జున స్వామి కేతమ్మ ల చరిత్ర ను గత మూడు రోజుల నుండి కళ్యాణ మహోత్సవం మొదలుకొని ఈరోజు వరకు ఒగ్గు కళాకారులు వేషధారణతో జీవిత చరిత్రను ప్రజలకు కనువిందు చేసే విధంగా కళాకారులు కళా రూపం తో కథను తెలిపారు.ఎంతో మంది భక్తులు ఇక్కడికి చేరుకొని వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గునుకుల మల్లేష్, మాజీ అధ్యక్షుడు కసరమోని మల్లేష్ యాదవ కురుమ సంఘం ఆలయ కమిటీ సభ్యులు,  కుల సంఘాల పెద్దలు , గ్రామస్తులు ఎల్లవేళలా మల్లికార్జున స్వామి కృపా కటాక్షములు దీవించే విధంగా ప్రజలందరిని చూడాలని ఆలయ కమిటీ  వేడుక ఉన్నట్లు తెలిపారు.