ప్రజా సమస్యలపై పాల్గొన్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ జిల్లా క

Published: Thursday July 21, 2022

రామోజీ ఫిలింసిటీలో ఇంటి పట్టాలు ఇచ్చిన వారికి స్థలం కేటాయించాలి, దండుమైలారం హఫీజ్ పుర రైతులకు పట్టాదారు పాసు బుక్ లు ఇవ్వాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి కాడిగాల్ల భాస్కర్ డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని వినపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం హామీలు తప్ప అమలు చేయడం లేదని తెలిపారు. ఏండ్లు గడుస్తా ఉన్న కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారు. 7 సంవత్సరాలుగా డబుల్ బెడ్ రూంల హామి అమలు కావడంలేదు. 2007లో రామోజీ ఫిలిం సిటీ లో 189 సర్వే నెంబర్ లో 700 మందికి ఇంటి సర్టిఫికెట్లు ఇచ్చారు. దండుమైలారంలో  149 సర్వే నెంబర్లో 70 మందికి ఇంటి పట్టాలు ఇచ్చిన వారికి ఇంటి స్థలం కేటాయించాలి. దండుమైలారం ఆఫీస్ పూరలో సాగుచేసుకుంటున్న రైతులకు పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలి తులేకలాన్ గ్రామంలో 235లో సాగు చేసుకుంటున్న దళితులకు ధరణిలో ఎక్కించాలని తెలిపారు. కప్పపాడు గ్రామంలో 100 ఎకరాల బినామీ భూమిని వ్యవసాయ కూలీలు సుప్రీంకోర్టు హైకోర్టు జిల్లా కోర్టులను ఆశ్రయించడంతో 50బి ని రద్దు చేయడం జరిగింది ఈ భూమిని భూస్వామినుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూమిలేని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. పోల్కపల్లి గ్రామంలో పోరాడి సాధించుకున్న భూమి టిఆర్ఎస్ నాయకుని ఆధీనంలో ఉన్న 3ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచాలి. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు 7 వారాల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు వర్తింపజేయాలి. డ్వాక్రా పొదుపు సంఘాలకు పావలా వడ్డీ రుణాలు వెంటనే విడుదల చేయాలి. స్థానిక పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి. పెరిగిన వంట గ్యాస్, డీజిల్, పెట్రోలు, నిత్యవసర సరుకుల ధరలు తగ్గించి ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శవర్గ సభ్యులు సామేల్, మండల కార్యదర్శి జంగయ్య, మండల నాయకులు వెంకటేష్, గణేష్, బుగ్గరాములు, జగన్, లింగస్వామి, నర్సింహా, యాదగిరి, మల్లేష్, జంగయ్య, రమేష్, దాసు తదితరులు పాల్గొన్నారు.