మండల కేంద్రంలో మహిళా సమాఖ్య సభ్యుల సమావేశం

Published: Thursday September 22, 2022

బోనకల్, సెప్టెంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో మండలంలోని 22 గ్రామాల మహిళా సమాఖ్య అధ్యక్షురాలతో బుధవారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సోనీ అధ్యక్షత వహించారు. ఏపిఎం పద్మలత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎఫర్ట్ ఆర్గనైజేషన్ కమ్యూనిటీ ఆర్గనైజర్ కరుణ మాట్లాడుతూ తమ సంస్థ సి ఆర్ వై (చిల్డ్ రైట్స్ అండ్ యు) సంస్థ సహకారంతో మండలంలో పిల్లల కోసం పనిచేస్తున్నట్లు తెలియజేశారు. బాలల యొక్క ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తూ మండలంలోని ప్రతి గ్రామస్థాయిలో తమ ఆర్గనైజేషన్ పిల్లల కోసం ఏ విధంగా కార్యక్రమాలు చేపడుతుందో తెలియజేశారు. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి గ్రామంలో క్లస్టర్ గా విభజించి ప్రతి క్లస్టర్ లో కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ను ఏర్పాటు చేసి వారికి ప్రతినెల ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ లో తమ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చేటువంటి కుటుంబాలు ఆ కుటుంబాల్లోని పిల్లలు అందరితో ఏర్పాటు చేసి వారికి ప్రతినెల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయటం వలన ఆ గ్రామస్థాయిలో పిల్లలకు ఏర్పడే ఇబ్బందులను అధిగమించటానికి బాల కార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలు, పిల్లలపై ఏదైనా ఆఘాయిత్యాలు, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి వారి యొక్క హక్కులు పొందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా బాలికల యొక్క విద్య బాలికలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాల నివారణ కోసం బాలికలకు రక్షణ కల్పించడంలో తమ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బాలికల రక్షణ కోసం పాటుపడుతున్నట్లు తెలిపారు. ఈ సంఘాలే కాకుండా ప్రాజెక్టు పరిధిలో ఉన్న పిల్లలతోటి కలిపి చైల్డ్ కలెక్టివ్స్ ను ఏర్పాటు చేసి వారికి కూడా ప్రతి నెల ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. దీని ద్వారా ప్రతి గ్రామంలో ఏ పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి గ్రామాన్ని చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ గా మార్చుటకు తమ సంస్థ పాటుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగాలి అంటే కమ్యూనిటీలో ఉన్నటువంటి మహిళా సమాఖ్యల యొక్క పాత్ర కూడా చాలా కీలకమని అందుకోసమే మహిళా సమాఖ్య సభ్యులకు బాలల కోసం చేస్తున్న కార్యక్రమాలను తెలియజేస్తున్నట్లు తెలిపారు. బాలల కోసం పనిచేసే క్రమంలో వివిధ రకాలైన స్టేక్ హోల్డర్స్ తోటి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు దానిలో భాగంగానే మండల సమాఖ్య ప్రతినిధుల కు అవగాహన కల్పిస్తున్నామని దీని ద్వారా మహిళా సమాఖ్య సభ్యులు కూడా వీసీపీసీలో కమ్యూనిటీ బేస్ ఆర్గనైజేషన్ లో ఒక మెంబర్ అయి ఉంటారనీ, కనుక వీరికి దీనితోపాటుగా బిపిఎల్ కుటుంబాలకు చెందినటువంటి పిల్లలకు ఆ కుటుంబ సభ్యులకు కావలసిన సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య అన్ని గ్రామాల సభ్యులు , ఎఫర్ట్ ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు.