వెంకటాపూర్ తండాలో శ్రీ శ్రీ శ్రీ జగదాంబ మాత పల్లకి సేవ

Published: Saturday February 04, 2023
 మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కోఆర్డినేటర్ ఆనంద్
వికారాబాద్ బ్యూరో 3 ఫిబ్రవరి ప్రజాపాలన : 
వెంకటపూర్ తండాలోని శ్రీశ్రీశ్రీ జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ ఆలయ 16వ వార్షిక ఉత్సవాలకు చివరి రోజు హాజరయ్యానని మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ ఆనంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పల్లకి సేవా కార్యక్రమంలో పాల్గొని పల్లకి మోయడం జరిగిందన్నారు. వ్యవస్థాపకులు నేనావత్ కిషన్ నాయక్  వారి కుమారులు రవీంద్ర నాయక్ పరశురాం నాయక్ లు ఆలయ విశిష్టత గురించి తెలియజేశారని అన్నారు. భక్తులకు శ్రీ శ్రీ శ్రీ జగదాంబ మాత సేవాలాల్ మహారాజుల ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంతి రమేష్ కుమార్ శివ శివమాలలో ఉన్న న్యాయవాది తులసి రామ్ అనిల్ కుమార్ నరేందర్ నాయక్ తదితరులు  పాల్గొన్నారు.