పోడు భూముల పంపిణీలో మాకు న్యాయం చేయండి జిల్లా అధికారులకు లింగాపూర్ గ్రామస్తుల విజ్ఞప్తి

Published: Wednesday November 02, 2022
బెల్లంపల్లి నవంబర్ 1 ప్రజా పాలన ప్రతినిధి:  ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పోడు భూముల పంపిణీ సర్వేలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం  లింగాపూర్ గ్రామస్తులకు అన్యాయం జరిగిందని, వెంటనే జిల్లా అధికారులు కల్పించుకొని నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేకూర్చాలని గ్రామ పోడు రైతులు డిమాండ్ చేశారు.
 
ఈ సందర్భంగా మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు, లింగాపూర్ గ్రామంలో 100 మంది భూమిలేని రైతులు 2003 సంవత్సరం నుండి ప్రభుత్వ పోడు భూమిలో  సేద్యం చేస్తూ పంటలు పండించుకుంటూ జీవనోపాధి గడుపుతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో ఆట విశాఖ అధికారులు పంటలను తొలగించి మొక్కలు నాటారని, ఇటీవల పోడు భూముల భూ సర్వే నిర్వహించి 30 మందికి మాత్రమే భూ పంపిణీ చేశారని, భూమిలేని నిరుపేదలైన మిగతా 70 మందికి పైగా పోడు సేద్యం చేసుకుంటున్న  రైతులకు భూమిని కేటాయించకుండా అన్యాయం చేశారని, జిల్లా అధికారులు కల్పించుకొని గత 20 సంవత్సరాలుగా పోడు సేద్యం చేసుకుంటున్న భూములను ఎవరియి వారికి అప్పగించి న్యాయం చేయాలని లింగాపూర్ గ్రామ పోడు రైతులు విజ్ఞప్తి చేశారు.
ఆటవిశాఖ అధికారులు స్థానిక సర్పంచులు, అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడితో, వారికి గిట్టని వారికి భూ పంపిణీ చేయకుండా అడ్డుపడుతున్నారని, జిల్లా అధికారులు ఎవరి మాటలు వినకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపించి మిగతా డెబ్బై మందికి పైగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు భూ పంపిణీ చేసి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.