బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలి : చెన్నయ్య

Published: Tuesday September 28, 2021
హైదరాబాద్, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : పెరిగిన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ను 35 శాతానికి పెంచాలన్న మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. అదేవిధంగా బ్యాక్ లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం నాడు ఉదయం నిజామాబాద్ జిల్లాలో అంబేద్కర్ భవనంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు చిట్టి మోహన్ రావు అధ్యక్షతన మాలల ఆత్మీయ సమ్మేళన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి రవి రాష్ట్ర హంస అధ్యక్షులు అంగరీ ప్రదీప్ మరియు నగర మేయర్ నీతు కిరణ్ శేఖర్ కేంద్ర గిడ్డంగుల సంస్థ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి పరిమి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య మాట్లాడుతూ మాలలు రాజ్యాధికారం వైపు పయనించాలన్నారు. ప్రైవేటు రంగ సంస్థలలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ల రిజర్వేషన్లు ఎత్తి వేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చెన్నయ్య తీవ్రంగా మండిపడ్డారు. పెరిగిన జనాభా దామాషా ప్రకారం 16 శాతం నుండి 35 శాతానికి పెంచాలని అదేవిధంగా బ్యాక్ లాగ్  పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుని పదవి మాలలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ 2016 -17, 2017-18, 2019- 20, 2020-21 యాక్షన్ ప్లాన్ లో సెలెక్ట్ అయిన లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం సబ్సిడీ డబ్బులను జమ చేయకపోగా వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ ను దళిత బంధుకు ఉపయోగిస్తే సహించేది లేదన్నారు. హంస రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ కేజీ టు పీజీ తక్షణమే అమలు చేయాలని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ సొమ్మును తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు చిట్టేటి మోహన్ రావు  మాట్లాడుతూ పులాంగ్ క్రాస్ రోడ్లో అంబేద్కర్ గారి 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దళితులకు ఒక ఎకరం స్థలం కేటాయించి ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మెల్యే మరియు నగర మేయర్ నీతూ కిరణ్ శేఖర్ కోరినారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి దండు శేఖర్, బీజేపీ కార్యవర్గ సభ్యులు నాయుడు ప్రకాష్, నూడ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, ఏఎంసి చైర్మన్ అర్చన సూర్య క్రాంతి, సిటీ బ్యాంక్ డైరెక్టర్ ఓరకంటి లింగన్న, సీనియర్ పాత్రికేయుడు ఎడ్ల సంజీవ్, సుమన్, మరియు మండల జిల్లా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు.