సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించండి సి ఐ.మురళి మధిర నవంబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీీ

Published: Saturday November 05, 2022

మధిరలో ఆర్ వి కాంప్లెక్స్ దగ్గర మధిర సిఐ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. దీని గురించి సీఐ మురళిి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సీసీ కెమెరాలు ఆవశ్యకత ఎంతగానో ఉందని దాని వలన నేర నియంత్రణ గాని నేరాలు నిరోధించడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయని కావున ప్రతి ఒక్క వ్యాపారస్తులు తమ షాపులలో మరియు ఆర్ వి కాంప్లెక్స్ ఏరియాలో  కెమెరాలు పెట్టుకోవాలని సూచించడం జరిగింది. దీనికి గాను ఆర్ వి కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా 8 సీసీ కెమెరాలు పెట్టుకోవాడానికి ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్్ కమిషనర రమాదేవి మున్సిపల్ చైర్మన్ లత టౌన్్ ఎస్ఐ సతీష్ కుమార్ పాల్గొన్నారు