కూరగాయలుహీటెక్కిన టమాటా మధిరలో టమాట కేజీ 80 రూపాయలు

Published: Wednesday May 25, 2022
కూరగాయలుహీటెక్కిన టమాటా
మధిరలో టమాట కేజీ 80 రూపాయలు
మధిర మే 24 ప్రజా పాలన ప్రతినిధి కూరగాయల ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోయాయి. మొన్నటి వరకు కేజీ 15 రూపాయల ధర పలికిన కూరగాయలు సైతం భారీగా పెరిగిపోయాయి. రైతు బజార్లో టమాటా, దోసకాయ, వంకాయ, దొండకాయ, బీరకాయ, పొట్లకాయ, బెండకాయ, బీన్స్, తదితర కూరగాయలన్నీ కేజీ 20 నుండి 75 రూపాయల వరకు ధరలు పలుకుతోంది. బయట మార్కెట్లో మరో పది రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కూరల్లో అత్యధికంగా వినియోగించే టమాటా ధరలు సైతం ఇటీవల కాలంలో ఆకాశాన్ని అంటుకున్నాయి. టమాటా ధర మొన్నటి వరకు కేజీ 15 రూపాయల ఉంది.  ప్రస్తుతం సాధారణ మార్కెట్లో టమాటా కేజీ 80 రూపాయలు ధర పలుకుతోంది. రైతు బజార్లో  కేజీ 76 రూపాయలకు అందుబాటులో ఉన్నా నాణ్యమైన టమాటా రైతు బజార్లో అందుబాటులో లేవని వినియోగదారులు పేర్కొంటున్నారు. ఒకవైపు కూరగాయల ధరలు పెరిగి సామాన్య ప్రజలను చిన్నాభిన్నం చేస్తుండగా మరోవైపు చైనా ఉక్రెయిన్ యుద్ధం పేరుతో వంట నూనెలు పప్పులు ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు దృష్టి సారించి రోజు రోజుకి పెరిగిపోతున్న నిత్యావసర ధరలను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.