చలికాలంలో అధిక రక్తపోటు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి మేఘశ్రీ హాస్పిటల్స్ ప్రముఖ వైద్యులు ట

Published: Monday December 05, 2022

బోనకల్, డిసెంబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి: చలికాలం బీపీ షుగర్ లతో అప్రమత్తంగా ఉండాలని మేఘ శ్రీ హాస్పిటల్స్ ప్రముఖ వైద్యులు టి పవన్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలో బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో అమరజీవి , పేద ప్రజల ఆశాజ్యోతి, సిపిఐ సీనియర్ నాయకులు తూము ప్రకాష్ రావు జ్ఞాపకార్ధం మండలం కేంద్రం లో మేఘ శ్రీ హాస్పటల్ నందు నిర్వహించే బీపీ, షుగర్ ప్రత్యేక మెగా క్యాంపు ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చలికాలంలో అధిక రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా చెక్‌ చేసుకుంటూ ఉండాలన్నారు. బీపీలో అనూహ్య మార్పులు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. చలికాలంలో వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం వల్ల గుండె ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చన్నారు. బీపీ, షుగర్ పేషెంట్లు అవగాహన లోపంతో సరైన వైద్యం పొందక పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులకు గురవుతున్నారన్నారు. బిపీ, షుగర్ వ్యాధు లతో బాధపడుతున్నవారు వైద్యకోసం ఇతరత్ర పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. వీరికి సమయంతో పాటు నెలకు రూ.1000 నుండి రూ.2000 వరకు ఖర్చు తప్పుతుందన్నారు.ఈ ప్రత్యేక క్యాంప్ లో రూ.100కే నెలకు సరిపడ బీపీ, షుగర్ మందులు అందజేస్తున్న బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమన్నారు. ఈ ప్రత్యేక క్యాంపు మండల ప్రజలకు ఎంతగానో ఉపయోగకరమన్నారు. ఈ క్యాంపు మండలం లోని బీపీ షుగర్ పేషెంట్లు స్వదినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తోము రోషన్ కుమార్, సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, సిపిఐ సీనియర్ నాయకులు జక్కా నాగభూషణం, ఏలూరి పూర్ణచందు బిజెపి నాయకులు ఏనుగు సుమన్, దంత వైద్య నిపుణులు సోమనపల్లి ఉదయ్ కిరణ్, క్యాంప్ నిర్వహకులు ఆకెన పవన్, సాధనపల్లి ఆమర్నాధ్, ఫిజియోథెరపిస్ట్ షేక్ తాజ్, ల్యాబ్ టెక్నీషియన్లు యంగల గిరి, భవాని తదితరులు పాల్గొన్నారు.