ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 4 ప్రజాపాలన ప్రతినిధి *పాల ఉత్పత్తిదారులకు రేట్లు పెంచాలని సంఘం జి

Published: Saturday November 05, 2022
పాలరేట్లు పెంచి పాల రైతులను ఆడుకోవాలని తెలంగాణ రైతు సంఘం రంగారెడ్డి జిల్లా 2వ మహాసభ తీర్మానినించ్చింది. లీటర్ పాలకు 33రూపాలనుండి 36రూపాల వరకు లభిస్తుంది. పశుగ్రాసం, దానం పశువుల వైద్యం, లాంటి పశుపోషనకు కావలసిన అన్నిరకాల ధరలు పెరగడం మూలాన రైతులకు గిట్టు బాటు కావడం లేదు ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్న యువకులు గతంలో పాడి పరిశ్రమల వైపు దృష్టిసారించారు. కాని నేడు వారంతా పాడివలన నష్టాలపాలైన పాడి పరిశ్రమల నుండి వైదోలుగుతున్నారు ప్రభుత్వం పాడి రైతుల సమస్యలపై దృష్టి సారించాలని పాడి రైతుల పాలరేట్లు పెంచాలని సబ్సిడీపై దాన ఇవ్వాలని అలా రైతులు ఐక్యమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పాల రేట్లు  పెంచుకోవాలని మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది.జిల్లా రైతు సంఘం కార్యదర్శి మధుసూదన్ రెడ్డి , జిల్లా ట్రెజరరీ సిహెచ్ ముసలయ్య ,జిల్లా సహాయ కార్యదర్శి ఎం రామకృష్ణారెడ్డి, పత్రిక ప్రకటనలో తెలియజేశారు.