బీసీ కార్పొరేషన్ చైర్మన్ ను నియమించాలి

Published: Wednesday October 27, 2021
తెలంగాణ బీసీ జాగృతి పట్టణ అధ్యక్షులు మడుపు రామ్ ప్రకాష్ .
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్ 26, ప్రజాపాలన : బీసీ కార్పొరేషన్ చైర్మన్ ను నియమించా లని తెలంగాణ బీసీ జాగృతి మంచిర్యాల జిల్లా పట్టణ అధ్యక్షులు మడుపు రామ్ ప్రకాష్ అన్నారు. మంగళవారం స్థానిక ఐ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో. మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 56 %శాతం బీసీ జనాభా ఉన్నప్పటికీ కార్పొరేషన్ చైర్మన్ నియమించకా పోవడం అంటే బీసీ సమాజాన్ని మభ్య పెట్టడమే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ చైర్మన్ నియమించ పోవడం బీసీలపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ది ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలుగా నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కై బీసీ కార్పొరేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల 77 వేల మంది దరఖాస్తు చేసుకొని రుణాల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ దరఖాస్తులకు సంబంధించిన 10 వేల కోట్లు సబ్సిడీని విడుదల చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఎంతైనా ఉందన్నారు. బిసి ఫెడరేషన్ కు రుణాలు విడుదల చేస్తున్నామని అని ప్రకటించి ఏళ్లు గడుస్తున్నాయని, కుల వృత్తుల పై ఆధారపడి జీవించే వృత్తి కులాలు ఆశగా ఎదురు చూస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ జాగృతి జిల్లా కార్యదర్శి గుమ్మల శ్రీనివాస్ మంచిర్యాల పట్టణ ఉపాధ్యక్షులు మెంత్యాల సంతోష్ వైద్య భాస్కర్, పట్టణ కార్యదర్శి తోకల మహేష్, డేగ లక్ష్మణ్, కార్యనిర్వాహక కార్యదర్శి కాగితల సత్యనారయణ,  నాయకలు శ్రీనివాస్, ఆర్ ఎందుల రాజేశం, పట్టణ యువజన నాయకులు మంచర్ల సదానందం, తదితరులు పాల్గొన్నారు.