కలకోట లో కొనసాగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షలు

Published: Thursday February 03, 2022
బోనకల్, ఫిబ్రవరి రెండు ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని కలకోట గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల దయామణి ఆధ్వర్యంలో బుధవారం కరోనా నిర్ధారణ పరీక్షలును నిర్వహించారు.ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు గ్రామ పంచాయతీలోని ఇంటింటికి తిరుగుతూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తూ అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచనలు సలహాలు ఇస్తు, గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ వచ్చిందన్నారు. సిబ్బంది అనునిత్యము గ్రామపంచాయతీలో చెత్త సేకరణ నీరు పంపిణీ పరిసరాలను శుభ్రపరిచే క్రమంలో ప్రజలతో మమేకమై ఉండటంవల్ల సిబ్బందికి ముందుగా నిర్ధారణ పరీక్షలు మరొకసారి నిర్వహించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్లె దవాఖానా డాక్టర్ రాజేష్ తో కలిసి ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు చేస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలు పట్ల సర్పంచ్ యంగల దయామణి వారిని అభినందించారు. ప్రతిరోజు పంచాయతీ ట్రాక్టర్ ద్వారా కరోనా ప్రభలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి పంచాయితీ ట్రాక్టర్ ద్వారా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది విజయ రత్నం, ఎమ్మెల్యే, విజయ మొదలగు వారు పాల్గొన్నారు.