జ్యోతిరావు పూలే" 132వవర్ధంతి ఘనంగా నివాళులర్పించిన మండల పట్టణ కాంగ్రెస్ మధిర

Published: Tuesday November 29, 2022

నవంబర్ రూరల్ 28 ప్రజాపాలన ప్రతినిధి సోమవారం నాడు మండల పట్టణకాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల  కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి నివాళులు అర్పించిన మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గొప్ప సంఘసంస్కర్త మహిళల విద్య కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం  కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే"132వవర్ధంతి సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసిఘనంగాానివాళులర్పించారుఈ సందర్భంగా మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిర్యాల వెంకటరమణ గుప్తా* మాట్లాడుతూ జ్యోతిరావు పూలే స్త్రీలకు విద్య నిషేధమని ప్రవచించిన మనుస్మృతినితిరస్కరించారని. మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆధునిక భారతీయ నవయుగ వైతాళికుడు. వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన మాలి కులంలో జన్మించి భారతదేశానికి మార్గదర్శనం చేసిన మహనీయులు. ఎందరో ఫూలే నుండి స్ఫూర్తి పొంది సంఘ సంస్కరణలు చేపట్టారు. సమాజంలో నిరక్షరాస్యత, మూఢ విశ్వాసాలు, ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఇంగ్లాండు వారి వలస పాలన,  దురాగతాలు, బాల్య వివాహాలు కొనసాగుతున్న కాలంలో జన్మించి స్వయంకృషితో దేశానికి వెలుగుదివ్వె అయ్యారు. మరాఠీలో, ఇంగ్లీషులో చదువుకొని, రెండు భాషల్లోను అనేక రచనలు చేశారు. సామాజిక ఉద్యమకారుడిగా ఫూలే స్పర్శించని అంశం లేదు. కుటుంబ వ్యవస్థలో కొనసాగుతున్న వివక్షను ప్రశ్నించారు. మనుషులందరూ సమానమేనని, దేవుడు ఒక్కడే అని, మనిషిని మనిషిగా గౌరవించాలని, కులాన్నిబట్టి కాదని, జీవితమంతా పోరాడారు.పాశ్చాత్య దేశాల్లోని ప్రజాస్వామ్య వ్యవస్థలను, విలువలను, సంస్కృతిని, జీవన విధానాన్ని అధ్యయనం చేశారు అన్నారుఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు *చావా వేణు* మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు *దారా బాలరాజు* మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *అద్ధంకి రవికుమార్* మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు *దుంప వెంకటేశ్వర రెడ్డి* మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు* నియోజకవర్గ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు *కోరంపల్లి చంటి* పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు *షేక్ జహంగీర్* పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు *బిట్రా ఉద్దండయ్య* కాంగ్రెస్ నాయకులు *ఆదిమూలం శ్రీనివాసరావు, కోట నాగరాజు, కోటా డేవిడ్, పుట్ట పుల్లారావు, మైలవరపు చక్రి బోల్లెద్దు రాజేంద్ర*వుట్ల రాంబాబు అల్లినగరం ఎంపీటీసీ చిలక బత్తిని జయరాజు. బొలె పోగు సత్యానందం  కంచి పోగు ల జరు ఖమ్మంపాటి నాగయ్య. ఖమ్మంపాటి వీరయ్య. పలమల బాబురావు. మోదుగు బాబు*. మొదలగువారు పాల్గొన్నారు