అక్రమ నిర్మాణాలను కూల్చి వేయండి,

Published: Monday May 09, 2022
కన్నాల సర్పంచ్, వార్డు సభ్యులకు నోటీసులు_ జారీచేసిన డి ఎల్ పి ఓ
బెల్లంపల్లి మే 8 ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి మండల కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను వెంటనే కూల్చి వేయాల్సిందిగా కన్నాల సర్పంచ్ జిల్లపల్లి స్వరూపకు, వార్డు సభ్యులకు, పంచాయతీ కార్యదర్శికి, ఎంపీవోలకు శనివారం జిల్లా పంచాయతీ అధికారి ఫణింద్రరావు నోటీసులు జారీచేశారు. పంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పాలకవర్గం. పంచాయతీ అధికారులు పట్టించుకోవడం మార్చి 29న మాజీ సర్పంచ్ మంద అనిత, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధి కారులు, అక్రమ నిర్మాణాలు వాస్తవమేనని తేలిందని, డీఎల్పీవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని వారికి పంపించిన నోటీసుల్లో ఆదేశించారు.