ప్లాస్టిక్ వాడకం నిషేధం పై స్కూల్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

Published: Friday December 03, 2021

కోరుట్ల, డిసెంబర్ 02 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్ ఆదేశాలతో స్వచ్ఛ -సర్వేక్షన్ 2022 లో భాగంగా గురువారం రోజున ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు మున్సిపల్ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత మరియు తడి, చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త, మరియు 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ వాడకం నిషేధం పై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన  కల్పిస్తూ ఈ అంశాల పై వ్యాసరచన పోటీ కూడా నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ డి.గజానంద్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మహేష్, ప్రభుత్వ బాలికల పాఠశాల  హెడ్ మాస్టర్ భూపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.