ఘనంగా మిరియాల రాఘవరావు జన్మదిన వేడుకలు

Published: Thursday March 25, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సలహాదారులు, గ్రేటర్ వెస్ట్ సిటీ  బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ మిరియాల రాఘవరావు జన్మదినం సందర్భంగా మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గుడ్ సెపరేట్ డీప్ మరియు డంప్ స్కూల్, తపస్వి ఫౌండేషన్ హోమ్, షిరిడి సాయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల యామిని దివ్య మాట్లాడుతూ.. మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. మిరియాల రాఘవ రావు గారి జన్మదినం సందర్భంగా  ఓల్డ్ ఏజ్ హోమ్ ల లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజా సేవ చేయడానికి మా మామయ్య మిరియాల రాఘవరావు గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవున్ని ప్రార్థించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఎవరికి ఏ చిన్న ఆపద ఉన్నా, మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మిరియాల సుగుణ, మిరియాల ప్రీతం తదితరులు పాల్గొన్నారు.