గడ్డి కత్తిరించు యంత్రాలకు దరఖాస్తులు ఆహ్వానము

Published: Friday May 20, 2022
జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి అనీల్ కుమార్
వికారాబాద్ బ్యూరో 19 మే ప్రజా పాలన : సబ్సిడీపై గడ్డి కత్తిరించు యంత్రాలకు రైతుల నుండి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి అనీల్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వికారాబాద్ జిల్లాకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా (125 ) గడ్డి కత్తిరించు యంత్రాలు రాష్ట్ర సంచాలకులు, పశువైద్య మరియు పశు సంవర్ధక శాఖ ద్వారా మంజూరు చేయబడినవని పేర్కొన్నారు. ఈ యంత్రాలు 4 నుండి 20 పశువులకు మరియు 20 నుండి 150 జీవాలకు రోజూ చొప్ప కత్తిరించడానికి అనుకూలంగా ఉంటాయని అయన తెలియజేసినారు.  యంత్రాలు రెండు రకాలుగా ఉంటాయని అందులో ఒకటి 2 హెచ్.పి. 3 బ్లేడులు గల యూనిటు ధర రూ: 29,700 లు కాగా సబ్సిడీ రూ. 8000 లబ్దిదారుని వాటా రూ: 21,700 ఉంటుందన్నారు. రెండవ రకం
3 హెచ్.పి. 3 బ్లేడులు యూనిటు ధర రూ 34,560 లు కాగా, సబ్సిడీ రూ. 10,000
లబ్దిదారుని వాటా రూ: 24,560 లు. 
 గడ్డి కత్తిరించు యంత్రాల వినియోగం ద్వారా గడ్డి వృధా తగ్గడంతో పాటు పశువులు మరియు జీవాలకు సమతుల్య పోషకాలు అందుతాయని, తద్వారా పాడి పశువులలో పాల దిగుబడి, పునరుత్పత్తి పెరుగుతాయని మరియు జీవాలలో మంచి ఎదుగుదల ఉండి పాడి మరియు జీవాల రైతులకు ఆర్ధికంగా లాభదాయకంగా ఉంటుందన్నారు.
ఔత్సాహికులైన చిన్నా, సన్నకారు పాడి మరియు జీవాల రైతులు  గడ్డి కత్తిరించు యంత్రాల కొరకు అవసరమైన దరఖాస్తులను స్థానిక పశు వైద్య అధికారి నుండి పొంది అట్టి దరఖాస్టుకు  ఫోటో, ఆధార్ జిరాక్స్ తో పాటు కుల ధ్రువీకరణ పత్రము (SC & ST అయితే) జత చేసి  తమ లబ్దిదారుని వాటా జిల్లా పశువైద్య మరియు పశు సంవర్ధక శాఖాధికారి పేరున డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించి తమ దరఖాస్తులను స్థానిక పశు వైద్యుడిచే జిల్లా పశువైద్య మరియు పశు సంవర్ధక శాఖాధికారి కార్యాలయమునకు సమర్పించి ఈ పథకాని సద్వినియోగం చేసుకోగలరాని వారు కోరారు.