మానవతా దృక్పథంతో రక్తదానం చేయాలి.

Published: Friday January 14, 2022
..జిల్లా చైల్డ్ లైన్ సమన్వయకర్త సత్యనారాయణ
మంచిర్యాల బ్యూరో‌, జనవరి 13, ప్రజాపాలన : రక్త దానం మరొకరికి ప్రాణదానం ఔతుందని, యువత మానవతా దృక్పథం తో  రక్తదానం చేయాలని జిల్లా చైల్డ్ లైన్ సమన్వయకర్త సత్యనారాయణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ హాస్పిటల్ లోగల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో క్యాథలిక్ డయాసిస్  బిషప్ ప్రిన్స్ ఆంటోని ఆదేశాల మేరకు చర్చి ఫాదర్ లు, యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్నికి జిల్లా చైల్డ్ లైన్ సమన్వయకర్త సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆరన మాట్లాడుతూ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు లో రక్త నిలువలు లేవు అని పత్రికల ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలిసిందని అన్నారు, రక్తము కొరత కారణంగా తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు మృత్యువు తో పోరాడుతునారు. అలాగే ప్రభుత్వ హాస్పిటల్ లోని నిరుపేదలు గర్భిణీ స్త్రీలు, కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్,రక్తం కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. దీనిని  దృష్టి లో ఉంచుకుని 20 మంది యువకులు రక్త దానం చేశారని తెలిపారు. త్వరలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తాము హామీ ఇచ్చారు. అదేవిధంగా జిల్లా లోని స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి  కరోనా నిబంధనలు పాటింస్తూ రక్తదాన శిబిరాలు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఫాదర్ ప్రిన్స్,  హ్యూమన్ ప్రమోషన్ సొసైటీ డైరెక్టర్ జిజో, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్, చైల్డ్ లైన్ సిబ్బంది సుమలత, పాల్గొన్నారు.