జేఎస్ఎస్ డైరెక్టర్ రాధాకృష్ణ అధ్వర్యంలో ఘనంగా వేడుకలు..

Published: Thursday April 06, 2023
తల్లాడ(ఖమ్మం), ఏప్రిల్ 5 (ప్రజా పాలన న్యూస్): మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని బుధవారం  జనశిక్షన్ సంస్థాన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు.  ఖమ్మం పట్టణంలో ముస్తఫానగర్ బీసీ హాస్టల్, సుగ్గాలవారి తోట,శ్రీరాంనగర్, కొత్తగూడెం అల్లిపురం, దంసలాపురం, అగ్రహారం, జలగమ్ నగర్ లో ఉచిత టైలరింగ్, బ్యూటిషన్ ఎంబ్రాడర్ శిక్షణ పొందుతున్న లబ్ధిదారుల సెంటర్స్ లలో నిర్వహించారు. ఈ సందర్భంగా జేఎస్ఎస్ ఖమ్మం జిల్లా  డైరెక్టర్ వై  రాధాకృష్ణ పాల్గొని బాబు జాగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ 
దేశ స్వాతంత్ర్య సమరయోధుడిగా, గొప్ప రాజకీయవేత్తగా, సామాజిక సమానత్వం కోసం తన జీవితకాలం పోరాటం చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ రోస్లినా, మందడపు లక్ష్మి మనోహర్, పాల్గొని జె యస్ యస్ అందిస్తున్న స్వయం ఉపాధి శిషణ మహిళలకు ఎంతగానో ఉపయోగ పసుతున్నాయి అని ఈ శిక్షణలను అందిస్తున్న డైరెక్టర్ రాధాకృష్ణకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో యస్ కె రజియా,రిసోర్స్ పర్సన్స్ జాస్మిన్, కవిత, చాందిని, జులేఖ బేగం, శాంతి, అనిత, చంద్రకళ, రసూల్ బీ, ప్రశాంతి, నాగమణి, కాలంగి మేరీ నాగేశ్వరావు , రవి పాల్గొన్నారు.