ప్రెస్ క్లబ్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ

Published: Saturday October 15, 2022
బెల్లంపల్లి అక్టోబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంపు ప్రెస్ క్లబ్ కు శనివారం జరగనున్న ఎన్నికలకు నామినేషన్ల ను స్వీకరిస్తున్న అడుహక్ కమిటీ  సభ్యులు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శుక్రవారం నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ఉంటుందని, శనివారం ఉదయం 11 గంటల నుండి మూడు గంటల వరకు స్థానిక పద్మశాలి భవన్లో  ఎన్నికలు నిర్వహించి, అనంతరం ఫలితాలు ప్రకటిస్తామని, ఎన్నికలు మందమర్రి, కాసిపేట, భీమిని, మండలాలకు చెందిన సీనియర్ రిపోర్టర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో  కమిటీ సభ్యులు రాజశేఖర్, కిరణ్, రమేష్, సుభాన్, పవన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area