ఫోటో గ్రాఫర్ పై దాడిని నిరసిస్తూ బారి ఎత్తున ర్యాలీ నిరసన...

Published: Tuesday September 07, 2021
పాలేరు సెప్టెంబర్ 6 (ప్రజాపాలన ప్రతినిధి) : నేలకొండపల్లి మండల ఫొటో & విడియో గ్రాఫర్ యూనియన్ ఆధ్వర్యం లో ఫోటోగ్రాఫర్ పై దాడిని ఖండిస్తూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఫోటోగ్రాఫర్స్ యూనియన్లు నిరసన ర్యాలీ బంద్ కు పిలుపునిచ్చారు ఆంధ్ర ప్రదేశ్. అనంతపురంలో ఓ హోటల్లో ప్రోగ్రాం లో ఉన్న. భాషా అనే ఫొటో గ్రాఫర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఖమ్మం జిల్లా అధ్యక్షులు వేములూరు నాగరాజు దేవర, పిలుపు మేరకు ఈ రోజు అనగా సెప్టెంబర్ 6వ తేది సోమవారం 4 గంటల 30 నిమిషాలకు నేలకొండపల్లి మండల కేంద్రంలో వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ప్లే కార్డ్స్ చూపిస్తూ నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా ఫొటో & విడియోగ్రాఫర్స్ నేలకొండపల్లి మండలం శ్రీరామ్ సెంటర్ నందు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు ఈ బంద్ లో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు జెర్రిపోతుల సత్యనారాయణ, మాట్లాడుతూ అనంతపురం హోటల్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని నిరసన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సిద్దల శ్రీనివాస్ రావు, మండల ఉపాధ్యక్షుడు వారికుప్పుల గోపి, జిల్లా కమిటీ నెంబర్ నోములు నాగేశ్, మాజీ మండల అధ్యక్షుడు వల్లాల ఉపేందర్, గొలుసు ఆంజనేయులు, AVరాజు, జిల్లా నాయకులు దండా శ్రీనివాస్, రమాగిరి రవి, మారగాని, కొత్తకొండ వేంకటేశ్వరరావు, కొమ్మూరి నరేష్, మారగాని పద్మారావు, Sk మౌలానా జేర్రిపోతుల అంజనీ, కుక్కల జానీ, కైలసపు రేణు, ఫోటోగ్రఫి_ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.... ఫొటో & విడియో గ్రాఫర్ ఆషొసియన్ నేలకొండపల్లి మండల కమిటీ...