పట్టణ, పల్లె ప్రగతి వరిధాన్యం కొనుగోలుపై పునఃసమీక్ష * వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల

Published: Tuesday May 17, 2022
వికారాబాద్ బ్యూరో 16 మే ప్రజా పాలన : రాష్ట్ర ముఖ్యమంత్రితో ఈ నెల 18 న ప్రగతిభవన్ లో జిల్లా కలెక్టర్లతో సమావేశం సందర్బంగా జిల్లాలో చేపట్టిన పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి మరియు వరి ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులతో ప్రీ - రివ్యూ సమావేశం నిర్వహించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి వరిధాన్యం కొనుగోలు తదితర అంశాలపై ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇండ్లు, భవనాల అనుమతుల విధానాన్ని సులభతరం చేసేందుకు టీయస్ బీపాస్ ను జిల్లాలో అమలు చేయడం జరుగుతుందని,
 మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో చేత్త సేకరణకు కొనుగోలు చేసిన ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా ప్రతి రోజు చేత్త సేకరణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులు పట్టణాలలో పబ్లిక్ టాయిలెట్ ల నిర్మాణం వంద శాంతం పూర్తి అయినట్లు తెలిపారు.  మున్సిపల్ పరిధిలో 80 శాంతం, గ్రామ పంచాయతీలలో 100 శాంతం టాక్స్ కలెక్షన్ చేయడం జరిగిందని తెలియజేసినారు.
నిరుపయోగంగా ఉన్న బోర్లను మూసివేయడం జరిగిందని, హరితహారం నర్సరీలను పక్కడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని, హరితహారం ఖర్చుల కొరకు గ్రీన్ బడ్జెట్ నిధుల నుండి 11 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు.  సమీకృత వెజ్ మరియు నాన్ - వెజ్ మార్కెట్ ల నిర్మాణం పనులు వేగవంతం చేయడం జరిగిందన్నారు.  జిల్లాలో రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు కొరకు ఇప్పటి వరకు 80 కేంద్రాలు ప్రారంభించడమైనదాని తెలిపారు.  ప్రస్తుతం 13 కేంద్రాల నుండి 84 రైతుల ద్వారా 4,222 క్వింటల్ల వరి ధాన్యం సేకరించడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్ మున్సిపల్ కమీషనర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, ఫీజికల్ హెల్త్ ఇఇ ప్రభాకర్ రెడ్డి, డీపీవో మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.