ఉపాధి కూలీల సమస్యలను తీర్చలేని అసమర్థత పాలన

Published: Tuesday June 14, 2022

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని మజీద్ పూర్ గ్రామ సర్పంచ్ పోచంపల్లి సుధాకర్ రెడ్డి ఉపాధిహామీ కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉపాధి కూలీలను అడుగున తొక్కేస్తున్నారు అని అన్నారు. అదేవిధంగా ఉపాధి కూలీలకు కనీస వేతనాలు అందించలేక పోతున్నారు అని ఇప్పటివరకు నాలుగు వారాలు గడుస్తున్నా వేతనాలు అందక ఉపాధి కూలీలు సతమత మవుతున్నారు అని, అదే కాకుండా ఉపాధి కూలీలకు ఎర్రటి ఎండలో పని కల్పించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం త్రాగడానికి నీళ్లు అందించలేక పోతున్నారని, చంటి పిల్లలతోని ఉపాధి పనికి కనీసం మూడు కిలోమీటర్ల దూరం వెళితే చిన్న పిల్లలను నీడలో వదిలి వెళ్దామంటే కనీసం టెంటు ఏర్పాటు చేయలేని ప్రభుత్వాలు, ఆకస్మికంగా ప్రమాదవశాత్తు తేలు, పాము వంటి విష పురుగులు ఏమైనా కుట్టినచో పార, గడ్డపార లతో ఏమైనా ప్రమాదం జరిగితే చికిత్స నిమిత్తం మెడికల్ కిట్ అందించలేని ప్రభుత్వం మరోపక్క ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకంపై ఈ రోజే మీరు విధుల్లోకి చేరాలని అసెంబ్లీలో చెప్పిన మాటలు నీటి బుడగల గా మారాయని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందని, దళితుల పేరుతోటి సొమ్మును కాజేసిన ముఖ్యమంత్రి. ఈ ఉపాధిహామీ కూలీల లో ఎక్కువ మంది నిరుద్యోగులే కనిపించడంతో అందులో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కనబడడం విశేషం?దళిత బంధు, దళిత రాష్ట్ర ప్రజలందరికీ ఇస్తానని చెప్పిన కేసీఆర్ గ్రామంలో ఒక్కరికి మాత్రమే అది కూడా అధికార పార్టీలో ఉన్న వారికే ఇవ్వడం గమనార్హం. ఇప్పటికైనా కెసిఆర్ కేవలం పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లు కాకుండా, బీఈడీ చదివిన విద్యార్థుల నోటిఫికేషన్లు జారీ చేయించి వారికి అవకాశాలు కల్పించే  విధంగా ప్రభుత్వం కృషి చేయాలని సర్పంచ్ పోచంపల్లి సుధాకర్ రెడ్డి  తెలియజేశారు.