తాండూర్ లో ఐదున్నరకే కనిపించిన సూర్యగ్రహణం

Published: Wednesday October 26, 2022

 రాష్ట్రంలో కనివిందు చేసిన సంపూర్ణ సూర్యగ్రహణం, మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఒకేసారి చల్లదనంతో నెమ్మది, నెమ్మదిగా, చీకట్లు కమ్ముతుండడంతో స్థానికంగా చిన్న పిల్లలు, విద్యార్థులు, గతంలో ఎన్నడు సూర్యగ్రహణం చూడని వారు, ఎంతో సంబరాలతో కేరింతలు కొడుతూ, యువకులు, పెద్ద మనుషులు, ఎక్స్ రే ఫిల్ముల ద్వారా, సూర్య గ్రహణాన్ని చూస్తూ ఆనందించారు.