ప్రధాన మంత్రి గ్రామీణ రోడ్ల,వంతెనల నిర్వహణ పనులను పర్యవేక్షించిన రాష్ట్ర స్థాయి నాణ్యత పర్

Published: Wednesday September 29, 2021
హైదరాబాదు 28 సెప్టెంబర్, ప్రజాపాలన ప్రతినిధి : ప్రధాన మంత్రి గ్రామీణ రోడ్ల నిర్మాణం (పియంజిఎస్.వై) నిధుల నుండి మంజూరి చేయబడిన రోడ్డు మరియు వంతెన నిర్మాణ పనులను జాతీయ మరియు రాష్ట్ర స్థాయి నాణ్యత పర్యవేక్షణ   అధికారులతో వివిధ స్థాయిల్లో పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో పిఎంజిఎస్ వై గ్రాంటు క్రింద నిర్మాణం చేసిన రోడ్డు మరియు వంతెన నిర్మాణ పనులు ఐదు సంవత్సరాల వరకు కాంట్రాక్టర్లు (మెయింటెయిన్స్) నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఇందులో భాగంగా మంగళవారం నాడు శ్రీ.ధశరథం రాష్ట్ర స్థాయి నాణ్యత పర్యవేక్షణ నిపుణులు నల్ల వాగు నుండి అంతర్గాం వెల్లే రోడ్డులో నల్లవాగు పైన పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా నిర్మించిన వంతెన (మెయింటెనెన్స్) నిర్వహణ పనులను పర్యవేక్షించారు. వీరివెంట పంచాయతీ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంజయ్య తాల్క, జి.మాధవ నాయుడు అసిస్టెంట్ ఇంజనీర్, పి.నర్సింహులు జెటిఒ, ఆఫీస్ సిబ్బంది, సంబంధిత కాంట్రాక్టరు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.