పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Published: Tuesday July 05, 2022
బెల్లంపల్లి జూలై 4 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణంలోని నంబర్ టూ ఇంక్లైన్, జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో 1990- 91 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు,31 సంవత్సరాల అనంతరం 55 మంది కలుసుకొని  పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నాడు నిర్వహించారు.
 
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ చదువుకున్న పాఠశాలను మర్చిపోకుండా ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులందరి వివరాలు తెలుసుకొని అందర్నీ ఆహ్వానించి కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ పాఠశాలలో చదువుకోవడం వల్లనే మేము ఎంతో ఉన్నత స్థానాలలో ఉండి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఉన్నత స్థితిలో ఉన్నామని, తాము చదువుకున్న పాఠశాలకు గుర్తింపుగా తమ వంతు సహాయంగా తరగతి గదుల్లో పిల్లల కోసం ఏర్పాటు చేయడానికి మూడు సీలింగ్ ఫ్యాన్లను కొనివ్వడం జరిగిందని తెలిపారు, అలాగే 55 మందిమి, విద్యార్థుల కోసం ప్రతినెల 5 వేల రూపాయల చొప్పున సేకరించి, ఈ పాఠశాలలో చదువుకొని పేద విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు, తదితర, విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను అందించేందుకు సహాయపడతామని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు హామీ ఇచ్చామని వారు తెలిపారు.
అనంతరం అప్పటి ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన వెంకటయ్యని మరియు అటెండర్ గా పనిచేసి ప్రస్తుతం పండు ముసలి వయసులో ఉన్న  రామక్కను పిలిపించి శాలువాలతో ఏం ఘనంగా సన్మానించారు, 
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగు దేవానందం, ఉపాధ్యాయులు శ్రీనివాస్, కరుణానందమ్, రిటైర్డ్ టీచర్ మారుతీ రావు, నర్సయ్య, పాఠశాల సిబ్బంది, పూర్వ విద్యార్థులు, తదితరులు హాజరైనారు.
ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి విజయవంతంగా పూర్తి చేసినందుకు నిర్వాహకులకు విద్యార్థి బృందం అభినందనలు తెలిపారు.