ఘనంగా కామ్రేడ్ సుర్వి బిక్షపతి వర్ధంతి సభ

Published: Tuesday September 07, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 6, ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామంలో శనివారం సర్వి బిక్షపతి ప్రథమ వర్ధంతి సభ సిపిఎం పార్టీ గ్రామ కన్వీనర్ కోడూరి రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్ వెస్లీ  హాజరయ్యారు. వర్ధంతి సభను ఉద్దేశించి మాట్లాడుతూ పేద ప్రజల కోసం బిక్షపతి ఎంతో సేవ చేశారని సభకు వచ్చిన ప్రజలను చూస్తే అర్థం అవుతుందన్నారు. బహిరంగసభలో కామ్రేడ్ బిక్షపతి పెత్తుల్లా గ్రామంలో పేద ప్రజల కోసం అనేక త్యాగాలు చేసి ఇళ్ల స్థలాలు, పేదలకు కోసం భూములు పంచాలని, కూలీ రేట్లు పెంచాలని, జిత గాళ్లకు జీతాలు పెంచాలని, పేదల స్మశాన వాటిక కోసం, పేదలకు రేషన్ కార్డుల కోసం పింఛన్ల కోసం అనేక ధర్నాలు కూడా చేయడం జరిగిందని సర్వి బిక్షపతి సేవలను వేనోళ్ల కొనియాడారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు రైతు వ్యతిరేక చట్టాలు చేయడం జరిగిందన్నారు. నిత్యావసర వస్తువులు గ్యాస్ సిలిండర్, ధరలు తగ్గాలన్న బిజెపి ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దింపాలని జాన్ వెస్లీ  కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు కాని అనేక హామీలు ఇస్తూ ఎంత మంది దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని దళితులకు పంగనామాలు పెట్టి ఇప్పుడు దళిత బంధు అనే పేరుతో దళిత ఓట్ల కోసం రోజుకో అబద్ధం ఆడుతున్నాడని ఇటువంటి ముఖ్యమంత్రిని వెంటనే గద్దె దింపాలని జాన్ వెస్లీ కోరారు. ఈ వర్ధంతి సభకు జిల్లా కార్యదర్శి రామ్ చందర్, జిల్లా కోర్ కమిటీ సభ్యులు సామేలు, సిపిఎం మండల కార్యదర్శి జంగయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జగదీశ్, సిపిఎం మండల కార్యవర్గ సభ్యులు దయ్యాల గణేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దయ్యాల కిషన్, మండల కమిటీ సభ్యులు వై రవీందర్, సిపిఎం గ్రామ కమిటీ సభ్యులు బోడ రమేష్, దయ్యాల భాస్కర్, బండి గణేష్, వార్డు మెంబర్లు ఆదరణ శోభ, బోడ ఊర్మిళ, సోషల్ మీడియా కన్వీనర్ అచ్చన శివ, దయ్యాల గణేష్, పంబలి ప్రభు, అదార్ల  ప్రభాకర్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.