విశ్వభారతి కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Published: Thursday September 29, 2022

కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి

వికారాబాద్ బ్యూరో 28 సెప్టెంబర్ ప్రజాపాలన : చదువుతోపాటు సంస్కృతి సాంప్రదాయ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని విశ్వభారతి కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని విశ్వభారతి కళాశాలలో మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ వికారాబాద్ ఎంపీపీ కామిడీ చంద్రకళ ఆధ్వర్యంలో నానబెట్టిన బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో పూలను అందంగా పేర్చి నానబెట్టిన బతుకమ్మ నాలుగవ రోజు సందర్భంగా పురస్కరించుకొని విద్యార్థులు అధ్యాపక బృందం సంతోషంగా జరుపుకున్నారని వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ విశేషాల గురించి విద్యార్థులు తెలుసుకునే అవకాశం ఉందని గుర్తు చేశారు. తొమ్మిది రోజులలో జరిగే బతుకమ్మ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకుంటారని వివరించారు. గతంలో భూస్వాముల దుర్మార్గపు చర్యలను అడ్డుకునేందుకు బతుకు అమ్మ అనే నినాదంతో బతుకమ్మ పండుగను జరుపుకోవడం విశేషమని తెలిపారు. సమాజంలో మహిళలందరూ చాకచక్యంగా జీవన ప్రమాణాలను పెంచుకుంటూ ఆదర్శంగా నిలుస్తుండటం భారతీయ సంప్రదాయానికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సత్యనారాయణ గౌడ్ బస్వరాజు, చైర్మన్ వెంకట్ రెడ్డి, కళాశాల విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.