రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేయాలి

Published: Wednesday February 09, 2022
మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 08, ప్రజాపాలన: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి రక్త నిధి కేంద్రంలో రక్త నిలువలు నిండుకుంటున్న సందర్గంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదజేశానుసరం రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా ఛైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి బెల్లంపల్లి ఎ సి పి ఎడ్ల మహేష్ ను కలిసి రక్త దాన శిబిరాల నిర్వహణ కొరకు వారికి మంగళవారం వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 1000 మంది తలసేమియా సికిల్ సెల్ వ్యాది గ్రస్తులు ఉన్నారు అని, కరోన వ్యాది భయంతో స్వచ్చంద సేవ సంస్థలు ముందుకు రకపోడం,వాక్సిన్ డ్రైవ్, సమ్మక్క సాలమ్మ జాతరతో రక్త దాన శిబిరాల నిర్వహణ లేక రక్తం అందక రొగులు  మృత్యువాత పడుతున్నారని, రక్తదాన శిబిరాలతో ఇలా వచ్చిన రక్తాన్ని తలసేమియా సికిల్ సెల్ పిల్లలకు, మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ లోని నిరుపేద రోగులకు ఉచితంగా అందచేస్తున్నాము అని వివరించడం జరిగిందని. దీనికి బెల్లంపల్లి ఎ.సి.పి ఎడ్ల మహేష్ స్పందించి బెల్లంపల్లి ఎ సి పి పరిధిలో ని పోలీస్ స్టేషనల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించి యువకులు పాల్గొనే విధంగా కృషి చేస్తానని తప్పకుండా మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించి తలసీమియా పిల్లల ప్రాణాలను కాపాడుదాం అని హామీ ఇచ్చినారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా బ్రాంచ్ చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు సత్యపల్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యుడు కాసర్ల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు.