ఘనంగా సెయింట్ మార్క్స్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

Published: Monday March 06, 2023
మేడిపల్లి, మార్చి 5 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్లోని సెయింట్ మార్క్స్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సమీర్ మాట్లాడుతూ కరోనా కరణంగా గత మూడు సంవత్సరాల నుండి పాఠశాలలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్ట లేకపోయామని, విద్యార్థులలో దాగివున్న సాంస్కృతిక అభిరుచిని వెలికి తీసే ప్రయత్నంలో  పాఠశాల వార్షికోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు.
 విద్యార్థులలో దాగి వున్న సృజనాత్మకతను వెలికి తీసే ప్రయత్నంలో సైన్స్ ఎగ్జిబిషన్ ను పాఠశాలలో నిర్వహించుకున్నామని, ఈ కార్యక్రమంలో అన్ని తరగతుల విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో నమూనాలు రూపొందించి, వాటి గురించిన విశ్లేషణ తల్లి తల్లిదండ్రులకు సరళ భాషలో విశదీకరిస్తుంటే మేము విద్యార్థుల పట్ల తీసుకొన్న శ్రద్ధకు తగిన ఫలితం దొరికినట్లయ్యిందని తెలిపారు.
కరోనా సంక్షోభం వల్ల యావత్ ప్రపంచం ఆర్థిక మాధ్యమాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో మా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు కలగవద్దని నాలుగు సంవత్సరాలుగా ఫీజులు పెంచలేదని తెలిపారు.
విద్యార్థిని, విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కరస్పాండెంట్స్, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.