ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 7ప్రజాపాలన ప్రతినిధి *డిప్యూటీ తాసిల్దార్ నీ కలిసి వినతిపత్రం అ

Published: Thursday December 08, 2022

రేషన్ షాప్ లో అన్ని రకాల నిత్యావసర సరుకులు పంపిణి చేయాలని డిమాండ్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర నాయకుడు
మాదగోని జంగయ్య గౌడ్*
.
మంచాల మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాలలో ప్రజలకు అన్ని రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో మంచాల మండలం డిప్యూటీ తహశీల్దార్ నరసింహ రెడ్డికి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమనికి హాజరు అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు నిరుపేద ప్రజల కోసం రేషన్ దుకాణాలలో అన్ని రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఆదుకున్నారు తెలంగాణ రాష్టం ఏర్పాటు అయిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ రేషన్ షాప్ లోపంపిణి చేసే  సరుకులకు కోతలు పెడుతూ పేద ప్రజల నడ్డి విరిసి ఒక బియ్యం మాత్రమే పంపిణీ చేయటం మహా దారుణం అన్నారు  గత ప్రభుత్వాలు రేషన్ షాప్ లో బియ్యం చెక్కర వంట నూనె గోధుమలు కిరోసిన్ పప్పులు సబ్బులు ఉప్పు ఇంకా ఎన్నో నిత్యావసర సరుకులు పంపిణీ చేసి పేద ప్రజలను ఆదుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పేద ప్రజలకు పంపిణీ చేసే అన్ని రకాల సరుకులు దూరం చేసారు పేద ప్రజలు మార్కెట్లో సరుకులు కొనాలి అంటే ధరలు విపరీతంగా పెరిగి పోవటంతో రోజు కూలి చేసుకుని జీవనం సాగించే ప్రజలు కూలి డబ్బులు సరుకులకు కూడా సారి పోవక పోవటంతో నిరుపేద ప్రజలు నాన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పేద ప్రజల కోసం అన్ని చేస్తున్న అని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రేషన్ సరుకులకు ఎందుకు కోతలు విధించాడో ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నారు వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వచ్చే కొత్త ఏడాదిలో రేషన్ షాప్ లోఅన్ని రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయటానికి శ్రీకారం చుట్టి పేద ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
1.ఎస్టీ సెల్ మండలం నాయకుడు సపవట్. రామారావు నాయక్ 2.సీనియర్ నాయకుడు సపవట్ పాండునాయక్ 3.గిరిజన సంఘం నాయకుడు
జటో త్ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు,