ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాష్ కు శుభాకాంక్షలు తెలిపిన కృపసాగర్ ముదిరాజ్

Published: Friday December 10, 2021
మేడిపల్లి, డిసెంబర్ 9 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శాసనమండలిలో ఏర్పాటు చేసిన డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ మేడ్చల్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు దొంతరబోయిన కృప సాగర్ ముదిరాజ్ బండ ప్రకాష్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్ ముదిరాజ్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.