మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నిత్యవసర వస్తువుల పంపిణీ

Published: Saturday May 22, 2021
కోరుట్ల, మే 21, ( ప్రజాపాలన ప్రతినిది) : కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామం లో మాజీ ప్రధాని  స్వర్గీయ రాజీవ్ గాంధీ  30 వర్ధంతి సందర్భంగా కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ గ్రామంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కరోనా విజృబిస్తున్న తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గ్రామానికి సేవ చేస్తున్న గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, సిబ్బందికి, ఆశా వర్కర్లకు, నిత్యవసర వస్తువుల పంపిణీ చేశారు. మరియు సాతారం గ్రామంలోని శ్రీమతి నివేదిత కృష్ణారావు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, అనాధలకు పండ్లను కోరుట్ల నియోజక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి ప్రధానిగా ఎన్నో సేవలు అందించిన రాజీవ్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాలకు కు  ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను పేదలకు ఉపయోగపడేట్టుగా చేశారని అన్నారు. కోవిడ్ ను దృష్టిలో పెట్టుకొని అందరూ తప్పకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కు తప్పకుండా పెట్టుకొని ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సు రాజ నర్సయ్య, ఎంపీటీసీ దూలూరు రాజు నర్సింలు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బిట్టు సహదేవ్, యువజన కాంగ్రెస్ నాయకులు ప్రణయ్, పోతవేణి శేఖర్, గౌతం రెడ్డి, సురేష్, హరీష్, రాజేష్, రవీందర్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు పాల్గొన్నారు