అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మద్దెల శివ కుమార్

Published: Thursday May 13, 2021
భద్రాద్రి, కొత్తగూడం, మే 12, ప్రజాపాలన ప్రతినిది : నర్సులు రోగులకు అందించే ఆప్యాయత అనురాగం అంకిత భావంతో కూడిన నిరంతర సేవలు అద్భుతము అమోఘము అపూర్వము అనితర సాధ్యము చారిత్రాత్మకం భారత రత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దెల శివ కుమార్ కన్నతల్లి మనకు  జన్మనిస్తే సుదీర్ఘమైన జన్మలో వచ్చే వ్యాధులు రోగాలు ప్రాణాపాయ స్థితి లలో మనకు అండగా నిలబడి ఆప్యాయత అనురాగం తో కూడిన అంకితమైన సేవలందించి వ్యాధి నయమైన వరకు మన తో వెన్నంటి ఉండి మన బంధువులు సొంత వాళ్ళు నిరాకరించిన కూడా మనలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించి పునర్జన్మ నిచ్చే నర్సులు నిజమైన ప్రాణదాత లని వారి అపూర్వమైన సేవలు అభినందనీయమని చారిత్రాత్మక మని అందువలననే అభిమానంతో గౌరవంతో ఇటీవల తాము తమ సంఘం తరఫున పెద్ద ఎత్తున నర్సులను వైద్యులను వైద్య సిబ్బందిని ఘనంగా సత్కరించి అభినందించి బహుమతులు అందజేయడం జరిగిందని భారత రత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దెల శివ కుమార్ ప్రశంసించారు 12 05 2021 పవిత్రమైన నర్సింగ్ వృత్తికి pఆదర్శప్రాయమైన మార్గదర్శకత్వాన్ని  అందించి రోల్ మోడల్ గా నిలిచిన  ద లేడీ విత్ ద లాంప్ స్వర్గీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినమైన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నర్సుల దినోత్సవంగా జరుపుకోవడం సముచితమని మద్దెల అన్నారు యుద్ధాలు జరిగినప్పుడు గాయపడ్డ జవాన్లకు సేవలు అందించడం లోనూ ఎవరూ దగ్గరికి తీయని వ్యాధిగ్రస్తులను కుష్టు రోగుల ను గర్భిణీ స్త్రీలను హెచ్ఐవి రోగులను ఇంకా ఎటువంటి రోగగ్రస్తులనూ ఐనా ఆదరించి అక్కున చేర్చుకుని వైద్య సేవలు అందించే నర్సులు నిజంగా దేవదూతలని  మద్దెల అభివర్ణించారు మరి ముఖ్యముగా ఈ కరోనా మహమ్మారి ఉపద్రవం లోనూ తండ్రి కొడుకును భార్య భర్తను అక్క చెల్లెల్ని అంటుకోని   మానవ సంబంధాలు అంతరించిపోయిన ఈ మారణహోమంలో సైతం ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందించే ఈ నర్సుల కీర్తిప్రతిష్టలు సేవలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు చారిత్రాత్మకంగా నిలిచి ఉంటాయని మద్దెల ఉద్ఘాటించారు ఆ అభిమానము ఆ గౌరవంతోనే నర్సు వృత్తిని చేపట్టిన కుమారి ఎస్తేరు రాణిని ఆ ప్రభువు సంకల్పంతో ఆదర్శ ప్రేమ వివాహం చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని మద్దెల ఆనందం వ్యక్తం చేశారు అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలను తెలియ చేసిన వారిలో మద్దెల తో పాటు జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకులు శ్రీ గొల్లపల్లి దయానంద రావు సంఘ నాయకులు మందా హనుమంతు కు కూసపాటి శ్రీనివాస్ సబ్బవరపు మధుసూదన్ చిన్ని కోలపూడి ధర్మరాజు అంతోటి పాల్ పొన్నెకంటి సంజీవ రాజు సంఘ సలహాదారులు సింగరేణి ఏరియా లైజన్ ఆఫీసర్ శ్రీ కలవల చంద్రశేఖర్ ప్రముఖ న్యాయవాది అభ్యుదయవాది అబ్దుల్ రజాక్ ప్రముఖ కళాకారులు సింగర్ సింగరేణి అపర బాలు అల్లి  శంకర్ ప్రముఖ సంగీత దర్శకుడు మా రపాక కృష్ణస్వామి  సినీ నటులు టి ధనరాజ్ ఉప సర్పంచ్ దుర్గేష్  లావుడియా సత్యనారాయణ మూడు బాలు నాగేందర్ బుస్సీ అంతోటి రాజు స్టీవెన్ జోసఫ్ తోత మహిళా నాయకురాలు బడి కల పుష్పలత జోగు రమాదేవి కొదురుపాక మీనాక్షి నక్క సృజన మాట్ల గాయత్రి కృపా వేణి మందా చంద్రకళ తదితరులు ఉన్నారు