సీఎంఆర్ఎఫ్ పథకంతో పేదలకు ఆర్థిక భరోసా

Published: Friday July 30, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 29 జూలై ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పథకంతో పేదలకు ఆర్ధిక భరోసా కల్పిస్తోందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గానికి సంబంధించిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. అనారోగ్యం ప్రమాదవశాత్తు గాయపడిన వారు కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ చికిత్స చేయించుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తోందని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తోందని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బంట్వారం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మర్పల్లి మార్కెట్ చైర్మన్ మల్లేశం ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.