ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి

Published: Tuesday July 05, 2022
కోరుట్ల, జూలై 04 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో.ఏర్పాటు చేసినటువంటి  పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ,మాదాపూర్ స్థానిక సర్పంచ్ దారిశెట్టి రాజేష్  ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సహకారంతో మన ఊరు- మన బడి  కార్యక్రమం లో భాగంగామొదట మాదాపూర్ గ్రామానికి నిధులు మంజూరు చేయగా ఆ నిధులతో నూతన గదులు, బాత్రూమ్స్ నిర్వహించబోతున్న మని,అలాగే ఒక్క గదికి నాలుగు ఫ్యాన్స్ ఏర్పాటు చేస్తున్నామని దారిశెట్టి  రాజేష్ తెలిపారు. పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కుల మతాలు భేదం లేకుండా విద్యార్థులు అందరూ యూనిఫాం దారించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.అలాగే ప్రభుత్వ  పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఒక పూట పౌష్టికాహారం అందజేయబడుతుందని తెలిపారు. ఉచిత దుస్తులతో పాటు పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని  వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కృష్ణా రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ అనసూర్య, పాఠశాల చైర్మన్ ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
 
 
 
Attachments area