రాయన పేట లో నేడే మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ

Published: Monday June 27, 2022
 మేఘ శ్రీ హాస్పిటల్ కు అంబులెన్స్ బహుకరణ
 
 
బోనకల్, జూన్ 26 ప్రజా పాలన ప్రతినిధి:
బీద ప్రజల ఆశాజ్యోతి అమరజీవి కామ్రేడ్ తూము ప్రకాశరావు 39 వర్ధంతి సందర్భంగా రాయన్నపేట గ్రామంలో బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మహనీయులు భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు విగ్రహాల ఆవిష్కరణ జరగనుందని సిపిఐ బోనకల్ మండల కార్యదర్శి యంగల ఆనందరావు తెలియజేశారు. రాయన్నాపేట గ్రామంలోని కామ్రేడ్ తూముప్రకాష్ రావు భవన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహనీయులు అయినా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, దేశ మాజీ ఉప ప్రధాని అయినా బాబు జగజ్జీవన్ రావు లా చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన వారి విగ్రహాలను సిపిఐ సీనియర్ నాయకులు మాజీ శాసనమండలి శాసనసభ సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు ఆవిష్కరించనున్నారు. అదే విధంగా బోనకల్ మండల కేంద్రంలో ప్రతినెల మొదటి ఆదివారం రోజున బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే బీపీ షుగర్ క్యాంపుకు అనుసంధానంగా తక్కువ ఖర్చుతో పేద ప్రజలకు ఉపయోగపడేలా బహుకరించిన అంబులెన్స్ ను మాజీ శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, బత్తిని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బత్తిని నాగప్రసాదరావు, బోనకల్ ఎంపీపీ శ్రీమతి కంకణాల సౌభాగ్యం, బోనకల్ జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, టిడిపి మండల అధ్యక్షులు రావుట్ల సత్యనారాయణ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కోట హనుమంతరావు, కలకోట పీఏసీఎస్ అధ్యక్షులు కర్నాటి రామకోటేశ్వరరావు, కలకోట ఎంపీటీసీ యంగల మార్తమ్మ, రాయన పేట సర్పంచ్ కిన్నెర వాణి, కలకోట సర్పంచ్ యంగల దయామణి, మహిళా సమాఖ్య నాయకురాళ్లు తోటపల్లి సునీత, సిపిఐ జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్, మండల నాయకులు ఏలూరు పూర్ణచంద్రరావు, తోటపల్లి ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.