రావినూతల గ్రామపంచాయతీ నందు పోషణ మాస కార్యక్రమం

Published: Thursday September 08, 2022

బోనకల్, సెప్టెంబర్ 7 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామపంచాయతీ నందు పోషణ మాస కార్యక్రమం సందర్భంగా పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకొనుట , తల్లిపాల ప్రాధాన్యత గురించి, పిల్లల సంరక్షణ పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పిల్లలు సమతుల్య ఆహారం తీసుకొనుట వలన బలంగా దృఢంగా ఉంటారని, మానసిక వికాసం అభివృద్ధి చెందుతుందని, పిల్లల సూపర్వైజర్ ఫీడింగ్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, ఎంపీటీసీ కందిమల్ల రాధ, ఉప సర్పంచ్ బోయినపల్లి కొండలు, ఎం ఈ ఓ ఇందిరా జ్యోతి, ఏఎన్ఎం సరోజిని, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు శివ నాగేంద్ర, సిహెచ్ ఉష, బి ఉష, పంచాయతీ కార్యదర్శి అశోక్, పిల్లల తల్లులు పాల్గొన్నారు.