స్థానిక సంస్థలకు నిధులు విధులుతో హర్షం

Published: Friday February 12, 2021
రాష్ట్ర జడ్పిటిసిల సంఘం ఉపాధ్యక్షురాలు బి.సుధారాణి
 
వెల్గటూర్, మార్చి 11 (ప్రజాపాలన): స్థానిక సంస్థలకు  మరియు స్థానిక ప్రజాప్రతినిధులకు నిధులు  విధులు కేటాయింపు పై  ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర జడ్పీటీసీల సంఘం ఉపాధ్యక్షురాలు జగిత్యాల జిల్లా వెల్గటూర్ జడ్పీటీసీ బి. సుధారాణి. ఈ సందర్భంగా మాట్లాడుతు స్థానిక సంస్థలను బలోపేతం చేసేవిదంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రజల తరపున మరియు జడ్పీటీసీల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవలే ఏర్పడిన రాష్ట్ర జడ్పీటీసీల సంఘం  తరపున తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్,పంచాయతి రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు  కలిసి నిధులు విధులు సంబంధించిన విషయాలను వెనువెంటనే అమలు అయ్యేవిదంగా చేసిన ఆదేశాలను జారీ చేసి గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి పట్ల కేసీఆర్ కు ఉన్న చిత్త శుద్ధి ఎనలేనిదని ఆమె తెలియజేశారు.
 
 
 
Attachments are