ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

Published: Monday April 04, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 03 ఏప్రిల్ ప్రజాపాలన :  పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు ఎస్టీ నిరుద్యోగ యువత నుండి ఆన్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిఖిల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ ఎస్టీ యువతీ, యువకులు ప్రభుత్వం భర్తీ చేయబోయే పోటీ పరీక్షలకు సన్నద్ద మయ్యేందుకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.  అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భర్తీ అయ్యే గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో జిల్లాలో 100 మంది ఎస్టీ నిరుద్యోగులకు ఉచితంగా సంబంధిత పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ నిర్ణహించిందని తెలిపారు. ఈ శిక్షణ పరిగి పట్టణ కేంద్రం లోని పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో వచ్చే నెల మే 1 నుండి ప్రారంభమవుతుందని అన్నారు. గ్రూప్-4 అభ్యర్థులు కనీసం డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలని 18 నుండి 47 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహించిన ఉచిత శిక్షణ కేంద్రాలలో శిక్షణ తీసుకొని ఉన్న వారు, ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు, వేరే కోర్సులలో శిక్షణ తీసుకున్న వారు ఈ శిక్షణకు అనర్హులని పేర్కొన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 4 నుండి 11 సాయంత్రం 5 గంటల వరకు http:///studycircle.cgg.gov.in/tstw అనే వెబ్ సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.