వైఆర్ న్యూ ట్రెండ్స్ ప్రొఫెషనల్ మెన్ & ఉమెన్ సెలూన్ ప్రారంభోత్సవం

Published: Saturday November 05, 2022
మేడిపల్లి, నవంబర్ 4 (ప్రజాపాలన ప్రతినిధి) 
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్
26వ డివిజన్ పరిధిలోని శంకర్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన వైఆర్ న్యూ ట్రెండ్స్ ప్రొఫెషనల్  మెన్ & ఉమెన్ సెలూన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, టీఆర్ఎస్  సీనియర్ నాయకులు పప్పుల అంజిరెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ యజమానిని  అభినందిస్తూ, వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని మరి ఎందరికో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు బుచ్చిబాబు,సాంబిరెడ్డి, మౌలానా,సూర్య,ప్రవీణ్,కటింగ్ షాప్ యజమానులు  తదితరులు పాల్గొన్నారు.